Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 15:02:33
facebook Twitter Googleplus
Photo

డైరెక్టర్ తేజ అంటే గతంలో బోలెడంత క్రేజ్ పేరు. ఇప్పుడు కూడా దర్శకుడిగా తేజకు పేరు ఉంది కానీ.. క్రేజ్ మాత్రం తగ్గిపోయింది. కొత్త కథ - కొత్త కాన్సెప్ట్ అని ఎన్నో రకాలుగా చెప్పినా.. మళ్లీ ఇప్పటికీ అదే పాత లవ్ స్టోరీని అరగదీసి చూపిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం నిజంగానే లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ స్టోరీ లైన్ రెడీ చేసుకున్నాడట తేజ.

సాధారణంగా కొత్తవాళ్లతో సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చే తేజ.. ఈ సారి మాత్రం స్టార్ క్యాస్టింగ్ అయితే ఈ మూవీకి మంచి క్రేజ్ వస్తుందని భావించడంతో.. దానికి తగ్గట్లుగానే స్టార్లను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో హీరోగా నటించేందుకు దగ్గుబాటి రాణాను ఒప్పించేశాడని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ గా అయితే అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని తీసుకుంటున్నాడట. ఇప్పుడు టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామను.. లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత తేజదే. ఆ కృతజ్ఞతతోనే దర్శకుడు తేజతో సినిమా చేసేందుకు కాజల్ అంగీకరించిందని తెలుస్తోంది.

దీనికి ముందు దగ్గుబాటి వెంకటేష్.. తేజతో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అది వర్కవుట్ అవలేదని ఆ మాటను దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా నిలబెట్టుకుంటోందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

,  ,  ,  ,  ,  ,