Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Nov-2017 12:58:29
facebook Twitter Googleplus
Photo

యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో మలయాళంలో కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయెల్. ఐతే అందులో నివిన్ పౌలీ లాంటి పెద్ద హీరోతో నటించినప్పటికీ ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు ఆమె తాను పుట్టి పెరిగిన ఫారిన్ కంట్రీకే వెళ్లిపోయింది. కానీ తెలుగులో మజ్ను లో అవకాశం రావడంతో తిరిగొచ్చి ఈ సినిమాలో నటించాక ఆమె దశ తిరిగింది. ఈ సినిమా అనుకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆపై ఆక్సిజన్.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాల్లో నటించిన అనుకు ఆశ్చర్యకరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

ఆ సినిమాల్లో నటిస్తుండగానే అనుకు మరిన్ని అవకాశాలు అందుతున్నాయి. తాజాగా అక్కినేని నాగచైతన్య సరసన నటించే అవకాశం కూడా పట్టేసిందట అను. చైతూ హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు అనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనునే హీరోయిన్ అట. అజ్నాతవాసి తీస్తున్నపుడు అను టాలెంట్ చూసి ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ.. తనకే చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కబోయే శైలజారెడ్డి అల్లుడు లో ఆమెకు ఛాన్స్ ఇప్పించాడట. ఈ చిత్రంలో కీలకమైన హీరో అత్త పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,