Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 10:59:35
facebook Twitter Googleplus
Photo

ఎంతైనా కూడా.. కోర్టులో కేసు నలుగుతోందంటే.. అదొక పెద్ద విషయం. ఆ కేసు నుండి విముక్తి వచ్చే వరకు ఒక పట్టాన ప్రశాంతత ఉండదు. అది కూడానూ ఒక డైవర్స్ కేస్ అయితే మాత్రం.. నిజంగా ఆ కపుల్ ఇద్దరికీ కాస్త నరకమే. ఆల్రెడీ విడిపోదాం అని డిసైడయ్యాక.. మళ్ళీ కోర్టులో కేసు అన్నేసి రోజులు నానుతోందంటే.. ముఖ్యంగా మీడియాలో ఏదో ఒక వార్త వస్తూ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి.

సరిగ్గా ఇన్నాళ్ళూ అమలా పాల్ విషయంలో అదే జరిగింది. ఈ సెక్సీ బ్యూటి దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు క్రిస్టియన్ వెడ్డింగ్.. ఇటు హిందూ పెళ్లి.. రెండూ చేసుకున్నారు ఈ కపుల్. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత దాదాపు సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకుంది అమల. ఇంతలో ఏమైందో తెలియదు కాని.. ఆ తరువాత తిరిగి నటించాలని ఫిక్సయ్యింది. అందువలన మా ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిన మాట తప్పావ్ అంటూ అమలా పాల్ పై అత్తింటివారి ప్రెజర్ పెరిగిపోయి.. చివరకు మనస్పర్ధలు పీక్స్ కు చేరుకుని.. డైవర్స్ కు దారితీసింది.

అయితే ఈ బుధవారం కోర్టు వీరికి కంప్లీట్ డైవర్స్ మంజూరు చేసింది. ఇప్పటికే అమల ఒక అరడజను సినిమాల్లో నటిస్తూ ఉండగా.. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయింది కాబట్టి ఇంకాసినన్ని సినిమాలు సైన్ చేస్తుందేమో చూడాలి

,  ,  ,  ,  ,  ,