Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2017 11:04:34
facebook Twitter Googleplus
Photo

డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఎంత వసూలు చేసింది? మొత్తంగా 80 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా చివరకు లాసులనే మిగిల్చింది. అయితే నిర్మాత దిల్ రాజు స్వయంగా నైజాం ఏరియా రిలీజ్ చేసుకున్నారు కాబట్టి.. ఆయనకు ఒక్కడికే లాస్ పెద్దగా వచ్చుండదు కాని.. తక్కి ఏరియాల్లో కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. కాకపోతే ఇలా లాస్ వచ్చిన సినిమాతో కూడా స్టయిలిష్ స్టార్ ఒక రికార్డును కొట్టాడండోయ్.

హిట్టయినా ఫ్లాపైనా ఒక సినిమాకు ఎంతవరకు రావాలో అంతే వస్తాయి. ఎందుకంటే ఆ స్టార్ పవర్ ను మరియు రిలీజ్ టైమింగును ఆధారపడి కలక్షన్లు వస్తున్న ఈరోజుల్లో.. సినిమా సినిమాకూ హిట్ రేంజ్ మారుతుంటుంది. ఇప్పుడు డిజె విషయంలో చూసుకుంటే.. ఈ సినిమా బన్నీ కెరియర్లో బెస్ట్ అవుతుందని దిల్ రాజు చెప్పారు కాని.. సినిమా మాత్రం మొత్తంగా 71+ కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్ లో అయితే ఏకంగా 7 కోట్ల నష్టం వచ్చిందట. లోకల్ లో కూడా చాలామంది చిన్నచిన్న దెబ్బలు తగిలే ఉంటాయ్. ఇక సరైనోడు సినిమా 76 కోట్లు షేర్ వసూలు చేసింది కాబట్టి.. బన్నీ కెరియర్లో బెస్ట్ ఫిలిం (కలక్షన్లపరంగా) సరైనోడే ఉంటుంది.

కాకపోతే ఇప్పుడు రికార్డ్ ఏంటంటే.. మన తెలుగులో కేవలం ప్రభాస్ కు మాత్రమే ఒక అరుదైన రికార్డ్ ఉంది. అసలు 70+ కోట్లు దాటి షేర్ వసూలు చేసిన సినిమాలు.. కేవలం ప్రభాస్ కు మాత్రమే రెండున్నాయి. బాహుబలి 1 అండ్ 2 అవి. తక్కిన హీరోల విషయానికొస్తే.. పవన్.. మహేష్.. చరణ్.. ఎన్టీఆర్.. చివరకు చిరంజీవికి కూడా కేవలం 1 సినిమా మాత్రమే 70 కోట్లు వసూళ్లు దాటింది. ఇప్పుడు బన్నీ ఒక్కడికే ప్రభాస్ తరువాత ఆ క్లబ్ లో రెండు సినిమాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,