Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2015 06:55:34
facebook Twitter Googleplus
Photo

లక్కీ గాళ్స్ అంటే సమంత శ్రుతిహాసన్. ఈ ఇద్దరిలో మోస్ట్ లక్కీ ఎవరు? అంటే సమంత అనే చెప్పాలి. శ్రుతిహాసన్ కెరీర్ ఆరంభం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఐరెన్లెగ్ అన్న బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. కానీ సమంత అలా కాదు. తెలుగులో తొలి నుంచీ గోల్డెన్ లెగ్గు గానే పేరొచ్చింది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఐరెన్ లెగ్గే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హవా అన్ని పరిశ్రమల్లోనూ సాగుతోంది.

శ్రుతి సమంత ఇద్దరూ తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్లు. శ్రుతిహాసన్ ముంబై కల్చర్ నుంచి వచ్చింది కాబట్టి హిందీలోనూ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఈ ఇద్దరినీ విడివిడిగా తరచి చూస్తే ఒక్కొక్కరికి అరడజను ప్రాజెక్టులు ఖాతాలో ఉన్నాయి. శ్రుతి హాసన్ ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమాకి సంతకం చేయకుండానే బాలీవుడ్ కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. యారా రాకీ హ్యాండ్సమ్ బాద్సాహో .. పులి అజిత్ 56వ సినిమా .. ఇంత పెద్ద క్యూ ఉంది. అలాగే సమంత ఇటీవలే తెలుగులో రెండు సినిమాలకు సంతకాలు చేసింది. అందులో మహేష్ బ్రహ్మూెత్సవం నితిన్-త్రివిక్రమ్ సినిమా ఉన్నాయి. ఇక తమిళ్లో 24 10 ఎంద్రాతుకుళ్ల విఐపి 2 వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

అసలు తెలుగులో డైరక్టు సినిమాలు లేకపోయినా కూడా వీరు చక్కగా డబ్బింగ్ సినిమాలతోనైనా మనల్ని అలరించేస్తారు. అదీ ఈ ఇద్దరు భామల సంగతులు.

,  ,