Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:17:09
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం.. సోషల్ మీడియాలో ఇరగదీసేస్తోంది. ట్రైలర్ ను విడుదల చేసిన 24 గంటల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించేసింది. గతంలో 1 మిలియన్ మార్క్ ను అందుకోవడానికే సమయం పట్టేసేది. కానీ ఇప్పుడు ఇది చాలా చిన్న మార్క్ అయిపోయిందనే చెప్పాలి.

దువ్వాడ జగన్నాధం థియేట్రికల్ ట్రైలర్ కు 24 గంటల వ్యవధిలో 7.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే ఒక్క రోజు వ్యవధిలో 74 లక్షల వ్యూస్ అన్నమాట.బాహుబలి2 ఇప్పటికే చాలా పెద్ద బెంచ్ మార్క్ ను సెట్ చేసి ఉండడంతో.. రికార్డుల జోలికి పోకుండా కేవలం వ్యూస్ కౌంట్ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వ్యూస్ యూట్యూబ్.. ఫేస్ బుక్ ప్లాట్ ఫాంలపై వచ్చిన ఉమ్మడి కౌంట్ గా కూడా పోస్టర్ లో చెప్పారు. యూట్యూబ్ లో ఇప్పటికే డీజే ట్రైలర్ 5 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటేయగా.. 1.2 లక్షల లైక్స్ వచ్చాయి. మరోవైపు దాదాపు 40 వేల వరకూ డిజ్ లైక్స్ కూడా పడ్డాయి.

డీజే ట్రైలర్ కొత్తగా ఏమీ లేదని ఒకవైపు జనాలు అంటూనే ఉన్నా.. వ్యూస్ వస్తున్న స్పీడ్ చూస్తుంటే.. ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలాఖరులో వస్తున్నామంటూ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో చెప్పారు కానీ.. ఇంకా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

,  ,  ,  ,  ,  ,