Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 15:13:40
facebook Twitter Googleplus
Photo

మెగా పవర్ స్టార్ తన లేటెస్ట్ మూవీ ధృవ షూటింగ్ ను ఫైనల్ స్టేజ్ కి తెచ్చేశాడు. ఇప్పటికే టాకీ పార్ట్ తో పాటు దాదాపు సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. అయితే.. ఒక్క టైటిల్ సాంగ్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కోసం రామ్ చరణ్ చాలానే కసరత్తులు చేస్తున్నాడని ఇప్పటికే చెప్పేసుకున్నాం.

కేవలం ఈ పాట కోసమే తన బాడీని మరింతగా తీర్చిదిద్దుతున్నాడు చెర్రీ. సినిమా మొత్తం అథ్లెటిక్ బాడీతో కనిపించనుండగా.. ఈ టైటిల్ సాంగ్ మాత్రం పోలీస్ ట్రైనింగ్ తీసుకోవడంలో భాగంగా వస్తుంది. అందుకే సుల్తాన్-డంగల్ వంటి బాలీవుడ్ సినిమాలకు పని చేసిన ట్రైనర్ ను తీసుకొచ్చి మరీ ట్రైనప్ అవుతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికి ఐదు రోజుల నుంచి సోడియం(ఉప్పు) కొంచెం కూడా లేని ఫుడ్ ని మాత్రమే తీసుకుంటున్న ధృవ.. పాట షూటింగ్ పూర్తయ్యేవరకూ ఇదే డైట్ ని కంటిన్యూ చేస్తాడట. ఒక్క షాట్ లో కూడా ఫిజిక్ తేడాగా కనిపించకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు అని తెలుస్తోంది.

వాటర్ కూడా చాలా తక్కువగాను.. అతి తక్కువగా ఆహారం తీసుకుంటున్నాడు చెర్రీ. కేవలం ఒక టైటిల్ సాంగ్ పండగ పబ్బం అనేవి కూడా లేకుండా.. ఈ రేంజ్ లో చెర్రీ కష్టపడుతుండడం చూస్తుంటే.. మూవీ మొత్తానికి ధృవ టైటిల్ సాంగ్ ని హైలైట్ గా తీర్చిదిద్దుతున్నారని అనడంలో సందేహం అవసరం లేదు.

,  ,  ,  ,  ,  ,