Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 17:19:31
facebook Twitter Googleplus
Photo

ఓవైపు షూటింగేమో అయిపోయిందని వార్తలొస్తున్నాయి. కానీ ?బ్రహ్మోత్సవం? రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా డేట్లు వినిపించాయి. ఏప్రిల్ 29 మొదలుకుని.. ఆ తర్వాతి నెల రోజుల్లో దాదాపు ఐదు శుక్రవారాల తేదీల్లోనూ బ్రహ్మోత్సవం విడుదల కాబోతున్నట్లు వేర్వేరు సందర్భాల్లో వార్తలు వచ్చాయి.

ఐతే తాజా సమాచారం ప్రకారం ?బ్రహ్మెత్సవం? మే 20న లేదంటే 27న విడుదల కావచ్చని సమాచారం. ఈ మేరకు పోటీలో ఉన్న మిగతా సినిమాలకు కూడా సమాచారం ఇచ్చారట. ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా తేడా కొట్టడానికి హడావుడి ఎడిటింగ్.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఓ కారణమైంది. మహేష్‌కు ?1 నేనొక్కడినే? విషయంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎడిటింగ్ సరిగా చేసి ఉంటే ఆ సినిమా బాగా ఆడి ఉండేదని మహేష్ కొన్నిసార్లు బాధపడ్డాడు కూడా.

ఈ నేపథ్యంలో ?బ్రహ్మోత్సవం? పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కావాల్సినంత టైం తీసుకోవాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, యూనిట్ సభ్యులకు స్పష్టంగా చెప్పేశాడట. సినిమా లేటైనా పర్వాలేదు.. ఔట్ పుట్ విషయంలో తేడా రాకూడదని.. ఏ తప్పూ జరగకూడదని స్పష్టం చేశాడట. అందుకే ముందే రిలీజ్ డేట్ ప్రకటించి.. హడావుడి పడకుండా పనంతా పూర్తయ్యాక, తమ కంఫర్ట్ చూసుకుని రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం. రజినీకాంత్ సినిమా ?కబాలి? మే 27 కాకుండా వాయిదా పడితే ఆ తేదీకి ?బ్రహ్మోత్సవం? వచ్చే అవకాశముంది. రజినీ సినిమా అనుకున్న తేదీకే వస్తే.. ముందు వారం ?బ్రహ్మోత్సవం?ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,