Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 15:12:25
facebook Twitter Googleplus
Photo

కొన్ని కమిట్మెంట్ల జోలికి వెళ్లకపోవడమే బెటర్. కాదు కూడదు అని వెళితే ఆ తర్వాత జరిగే పరిణామాల్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. డబ్బులు వస్తున్నాయని కదా అని ముందు వెనకా ఆలోచించుకోకుండా ప్రోసీడ్ అయిపోతే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడిప్పుడే ఈ విషయం అర్థమవుతున్నట్టుంది.

వారం క్రితం మైనింగ్ బారెన్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె బ్రహ్మాణి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేయకపోయినా అంత సందడి కనిపించింది ఆ పెళ్లిలో. కల్యాణానికి 500 కోట్లకి పైగా ఖర్చైందని టాక్. అసలు ఆ వైభోగం చూస్తే అంతకుమించి అయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఇక పెళ్లికి దేశంలో ఉన్న సెలబ్రిటీల్ని అందర్ని ఆహ్వానించాడు జనార్థన్ రెడ్డి. మాములుగా అయితే అంత కోటీశ్వరుడు పిలిస్తే అందరూ పొలోమనేవాళ్లే. కానీ గాలి అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్లి ఉండటంతో చాలామంది హ్యాండిచ్చేశారు.

అయితే కొంతమంది సినీ తారలకి భారీగా డబ్బు ముట్టజెప్పడంతో వాళ్లు సంతోషంగా హజరై చిందులు కూడా వేశారు. అలా స్టెప్స్ వేసిన వారిలో హీరోయిన్స్ తమన్నా.. రకుల్ కూడా ఉన్నారు. తమన్నా సంగతేమో కానీ ఇప్పుడు రకుల్ చుట్టూ మాత్రం నోటీస్ వార్తలు తిరుగుతున్నాయ్. అల్రెడీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ మీద కన్నేసిన ఐటీ శాఖ ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడదనే లెక్కలు లాగే పనిలో బిజీగా ఉంది. ఇటు డబ్బు పుచ్చుకొన్న వారికి కూడా నోటీస్ లు ఇచ్చిందని.. అలా ఐటీ నోటీస్ లు అందుకున్న వారిలో రకుల్ కూడా ఉందంటున్నారు. అయితే రకుల్ మాత్రం ఇదంతా నాన్సెన్స్ అనేసింది. నాకు ఎవరూ నోటీస్ లు ఇవ్వలేదు నేను ప్యూర్ అంటుంది. సరే ప్రస్తుతం ఎలా ఉన్నా ఫ్యూచర్ సంగతి తెలియదుగా. అసలే అది గాలి డబ్బు. టచ్ చేసిన వాళ్లందరూ ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. మరి రకుల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,