Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 11:20:20
facebook Twitter Googleplus
Photo

మళయాలంలో సంచలన విజయం సాధించిన ?ప్రేమమ్? సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రేమకథలతో ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన చైతూ, ఈ సినిమా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని మొదట్నుంచీ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు మరో కథనంతో ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. అదే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేయడం.
ఒక చిన్న ఎపిసోడ్‌లో నాగ చైతన్యకు తండ్రిగా వెంకటేష్ కనిపిస్తారని చాలాకాలంగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఆ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా అందిన సమాచారం మేరకు సినిమాలో ఈ ఎపిసోడ్ ఇప్పటికే తీశారని, వెంకటేష్ ఈ చిన్నరోల్‌లో అదరగొట్టారని తెలిసింది. ఇక ఈ సన్నివేశం వచ్చేపుడు మామ, అల్లుళ్ళైన వెంకీ, చైతూలను తెరపై చూడడం అభిమానులకే పండగే అని తెలుస్తోంది. ?కార్తికేయ? సినిమాతో సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,