Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2017 11:34:46
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు చాలా వరకు కామెడీ క్యారెక్టర్లు.. సెంటిమెంటు పాత్రలే చేశాడు. వాటిలో వెంకీ ఎంత బాగా చేసినప్పటికీ.. ఆయన సీరియస్ క్యారెక్టర్లు ఇంకా బాగా చేయగలడన్నది వాస్తవం. ఘర్షణ లాంటి సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. ఈ మధ్య దృశ్యం సినిమాలోనూ ఆయన అదరగొట్టారు. ఐతే ఇప్పుడు గురు సినిమాలో వెంకీ చేసిన సీరియస్ క్యారెక్టర్ చూస్తే షాకైపోవాల్సిందే. వెంకీ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో కచ్చితంగా ఇది ఉంటుంది. తమిళ-హిందీ వెర్షన్లను ఉన్నదున్నట్లుగా తెలుగులోకి దించేసింది దర్శకురాలు సుధ కొంగర. ఐతే ఒరిజినల్ చూసిన వాళ్లు కూడా తెలుగు వెర్షన్ కు కనెక్టవుతున్నారంటే అందుకు.. వెంకీ పెర్ఫామెన్సే కారణం. ఇక నేరుగా చూసే వాళ్లకు గురు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్సే అందుకు రుజువు.

ఒరిజినల్లో ఒక నటుడు అద్భుతంగా చేశాడని పేరు తెచ్చుకున్నాక.. రీమేక్ మూవీలో ఎంత బాగా చేసినా అంత పేరు రాదు. ఒరిజినల్లోని హీరో లాగే చేస్తే కాపీ అంటారు. మార్చి చేస్తే అంత బాగా చేయలేదంటారు. కానీ ‘గురు’లో వెంకీ పెర్ఫామెన్స్ చూస్తే మాత్రం ఒరిజినల్లో మాధవన్ పెర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్లు కూడా వెంకీకి సలాం కొడతారు. అంత బాగా ఆది పాత్రను పండించాడు వెంకీ. ఆయన లుక్.. బాడీ కూడా ఈ పాత్రకు సరిగ్గా సూటయ్యాయి. లుక్ పరంగా మాధవన్ కంటే కూడా మెప్పించాడు వెంకీ. సుధ తనకు పరిచయస్తురాలు కావడంతో మాధవన్ ‘ఇరుదు సుట్రు’ స్క్రిప్టుతో చాలా కాలం ట్రావెల్ చేశాడు. అతను ఆ చిత్రానికి అడిషనల్ స్క్రీన్ ప్లే కూడా అందించాడు. పాత్రను బాగా ఆకళింపు చేసుకోవడం వల్ల మరింత ఇన్వాల్వ్ అయి నటించాడు. అందుకే సినిమా చూస్తుంటే.. మాధవన్ కనిపించడు. అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒక నటుడు అంతగా ఇన్వాల్వ్ అయి చేసిన పాత్రలో నటించి మెప్పించడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ వెంకీ ఆ టాస్క్ ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. కొన్ని సన్నివేశాల్లో వెంకీ హావభావాలు మాధవన్ ను మించిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు తన శిష్యురాలు కావాలని ఓడిపోతోందన్న బాధతో కళ్లతో హావభావాలు పలికించిన తీరు.. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లో వెంకీ నటించిన వైనం అమోఘం. ఈ సినిమా కోసం వెంకీ శారీరకంగా.. మానసికంగా చాలా ఎఫర్టే పెట్టాడు.

,  ,  ,  ,  ,  ,