Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 11:11:00
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి కొత్త లుక్ వచ్చేసింది. రిలీజ్ అయిన కాసేపటికే.. టాప్ ట్రెండింగ్ అయిపోయి రికార్డులు సృష్టించేసిన ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చూపించిన డ్యాన్సింగ్ స్టిల్.. అందరికీ విపరీతంగా నచ్చేసింది. అయితే.. ఈ స్టిల్ తో ఇప్పుడు పోలికలు మొదలయ్యాయి. అది కూడా మెగా ఫ్యామిలీతోనే కావడం హైలైట్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో సేమ్ టు సేమ్ ఇలాంటి స్టిల్ ఒకటి చూపిస్తాడు పవన్. కాకపోతే.. కాసింత హ్యాడ్ మూమెంట్ డిఫరెంట్ అంతే. నాయక్ మూవీలో రామ్ చరణ్ కూడా ఇలా తన ఎడమ కాలు పైక లేపి ఒక చేతిని పైకి చూపించే స్టిల్ ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా.. ఇలాంటి స్టిల్ ఒకటి రెండు చోట్ల ఇచ్చాడు కానీ.. అది సినిమాలో కాకుండా వేరే స్పోర్టింగ్ ఈవెంట్ కు సంబంధించిన పోజ్.

మెగా హీరోలంతా సేమ్ టు సేమ్.. ఆహ్.. అంటూ పవన్ వేసే పంచ్ రేంజ్ లో అభిమానులు ఆన్ లైన్ లో హంగామా చేసేస్తున్నారు. ఈ పోస్టర్లలో పోలిక చూశాక అలా అనకుండా ఉండడం కష్టంలే.

,  ,  ,  ,  ,  ,