Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:42:48
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూస్తోన్న ఆనందక్షణాలు రానేవచ్చాయి. 'గబ్బర్ సింగ్ 2' సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ నెల 29న ప్రారంభమవుతోంది. ఆ తరువాత నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆయన, చెన్నయ్ ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. పవన్ అభిమానులకి ఉత్సాహాన్నీ .. ఊపుని తీసుకొచ్చేలా ఈ పాటలు వుండటం కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమా విజయంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి. దాంతో ఇప్పుడీ సినిమాలోని పాటలు కూడా ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గకుండా ఉండేలా దేవిశ్రీ కృషిచేస్తున్నాడట. ఈ పాటలపై ఇంత కసరత్తు జరుగుతోందంటే గబ్బర్ సింగ్ 2 మ్యూజికల్ హిట్ గా కూడా నిలవడం ఖాయమని పిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,