Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2015 11:17:38
facebook Twitter Googleplus
Photo

ఒకవైపున నిర్మాతగా .. మరో వైపున కథానాయకుడిగా చక్కని ప్లానింగ్ తో విష్ణు ముందుకి దూసుకెళుతున్నాడు. నిర్మాతగాను .. కథానాయకుడిగాను తాజాగా ఆయన చేసిన మరో చిత్రమే 'డైనమైట్'. కథానాయకుడి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందనేది ఈ టైటిల్ చెప్పేస్తోంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణు సరసన అందాల కథానాయిక ప్రణీత సందడి చేయనుంది. యువ సంగీత దర్శకుడు 'అచ్చు'స్వరాలను సమకూర్చాడు. ఈ పాటల పండుగను ఈ నెల 6న ఘనంగా జరుపనున్నారు.

పలువురు సినీ .. రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ పాటలను ఆవిష్కరించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం విష్ణు డూప్ లేకుండా చేశాడట. ఇందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడని చెబుతున్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. డిఫరెంట్ లుక్ తో విష్ణు చేస్తోన్న ఈ ప్రయోగం ఫలించాలనే ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,