Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 10:58:38
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ సినిమా అంటూ ఆ మేనియానే వేరు. రజనీతో సినిమా అనుకున్న నాటి నుంచి సినిమా విడుదలయ్యే వరకూ ఆ సినిమా మీద జరిగే చర్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కాలా. ఈ మధ్యనే ముంబయి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని చెన్నైకి చేరుకున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే కాలా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీలో రజనీ సరసన బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రజనీ భార్యగా మరొకరు నటిస్తున్నట్లు చెబుతున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహించే ఈ మూవీలో తలైవాకు భార్యగా ప్రముఖ నటి ఈశ్వరీ రావ్ నటించనున్నట్లుగా చెబుతున్నారు.

ఈశ్వరీరావ్ ను ఎంపిక చేసినట్లుగా చెప్పటంతో.. కాలా మూవీ కథపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఈశ్వరీ రావును ఎంపిక చేశారంటే.. కాలా జీవితంలో ఆమెను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత హ్యుమా ఖురేషి పాత్ర ఉంటుందా? అన్న సందేహం వినిపిస్తోంది. రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ మూవీని 2018లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ధనుష్ వండర్ బార్ బ్యానర్ మీద నటిస్తున్న ఈ మూవీలో ఈశ్వరి రోల్ గురించి మరో వాదన కూడా వినిపిస్తోంది. హ్యుమాతో లవ్ బ్రేక్ అయి.. తర్వాతి కాలంలో ఈశ్వరిని చేసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,