Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 16:26:15
facebook Twitter Googleplus
Photo

స్వామి రారా.. కార్తికేయ లాంటి హిట్లతో ఒక్కసారిగా నిఖిల్ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ?సూర్య వెర్సస్ సూర్య? కూడా పర్వాలేదనిపించింది. కానీ ?శంకరాభరణం? అతడి సక్సెస్ ఫుల్ జర్నీకి పెద్ద బ్రేకేసింది. నిఖిల్ కెరీర్లో అత్యంత భారీ అంచనాలతో విడుదలై.. అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఇదే. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి నిఖిల్ కు చాలా టైమే పట్టింది. కొన్ని నెలల విరామం తీసుకుని.. ?టైగర్? ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన కథతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నిఖిల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా దీనికి సంబంధించిన కబుర్లేమీ బయటకు రాలేదు.

ఐతే ఈ చిత్రానికి ఓ పొయెటిక్ టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ?ఆత్మబలం?లోని ఎక్కడికి పోతావు చిన్నవాడా .. పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్ గా అనుకుంటున్నట్లు సమాచారం. ముందు ఈ సినిమాకు ?అమల? అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా.. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటారేమో అని భావించి.. ఏఎన్నార్ పాట పల్లవినే టైటిల్ గా ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మేఘన ఆర్ట్ ప్రొడక్సన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళంలో వైవిధ్యమైన సినిమాలు తీసి.. తెలుగులో ?టైగర్?తో మంచి పేరు తెచ్చుకున్న వీఐ ఆనంద్.. నిఖిల్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,