Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 10:24:22
facebook Twitter Googleplus
Photo

గత ఏడాది సరైనోడు.. శ్రీరస్తు శుభమస్తు లాంటి మ్యూజికల్ హిట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ తమన్ కెరీర్ కొంచెం డల్లుగానే నడుస్తోంది ఈ మధ్య. ఇంతకుముందులాగా ఇబ్బడిముబ్బడిగా పెద్ద సినిమాలు వచ్చి పడిపోవట్లేదు. దీంతో తమన్ తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో రిలీజైన తమన్ కొత్త సినిమా టీజర్.. అతడి పేరు మార్మోగిపోయేలా చేస్తోంది. ఆ సినిమా పేరు.. స్కెచ్. తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా స్కెచ్. ఇంతకుముందు శింబుతో వాలు అనే సినిమా తీసిన విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వ వహిస్తున్నాడు.

నిమిషం లోపు నిడివి ఉన్న స్కెచ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. అందులో విక్రమ్ లుక్ పరంగా అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఈ టీజర్లో విశేషమంతా తమన్ బ్యాగ్రౌండ్ స్కోరే. వెహికల్ స్టార్ట్ అయ్యేటపుడు వచ్చే సౌండ్లతో మొదలుపెట్టి.. ఎనర్జిటిగ్గా.. స్టైలిష్ గా అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో మోత మోగించేశాడు తమన్. సరైనోడు టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తర్వాత మళ్లీ తమన్ అంత ఇంపాక్ట్ చూపించింది ఇందులోనే. ఈ టీజర్ గురించి మాట్లాడుతున్న వాళ్లందరూ తమన్ మీదే ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ జనాలంతా తమన్ ఆర్ ఆర్ కు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు

,  ,  ,  ,  ,