Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 10:39:41
facebook Twitter Googleplus
Photo

చాలా రోజుల నుండి ఈటివి ప్రభాకర్ మాంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఒక మంచి నటుడు అయ్యుండి.. ఒక దర్శకుడు అయ్యుండీ.. ఇన్నాళ్ళూ కేవలం సీరియల్స్ కు మాత్రమే అంకితం అయిపోయాడు. కాకపోతే దర్శకుడిగా మారాలని చాలా సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు కాని.. ఇదిగో ఇప్పటికి అన్నీ కుదిరాయ్.

గత నాలుగేళ్లుగా గీతా ఆర్ట్స్ క్యాంపులో కథలు చెబుతున్న ప్రభాకర్ కు ఎట్టకేలకు ఆ క్యాంపు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే తొలిసినిమాను అల్లు శిరీష్ తో చేస్తాడని అనుకుంటే.. ఇప్పుడు హీరో ఆదితో చేస్తున్నాడు. ఈయన చేసే సినిమాకు గీతా ఆర్ట్స్ తో కలసి.. బన్నీ వాసు అలాగే యువి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ వారు సంయుక్తంగా ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్ని కోట్లు బడ్జెట్ తో సినిమాను చేస్తున్నారో తెలియదు కాని.. ఈ నలుగురూ కలసి వి4 అనే బ్యానర్ పెట్టేసి ఈ సినిమాను తీయడం విశేషం.

ఏదేమైనా కూడా ప్రభాకర్ చాలా టాలెంట్ ఉన్న టెక్నిషియన్ అని అందరికీ తెలిసిందే. ఇలాంటి టాలెంటడ్ క్రియేటివ్ పర్సన్ కు మాంచి హిట్టొస్తే చూడాలని చాలామంది ఆశిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,