Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 15:03:33
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు...ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే తీరు కూడా చాలా పర్ ఫెక్టుగా ఉంటుందని అంటుంటారు. సినిమా వ్యవహారాలు, సంపాదన, కుటుంబ వ్యవహారాలు, అభిమానులతో ఆయన డీల్ చేసే వ్యవహారం, సేవా కార్యక్రమాల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి, అంకిత భావం, ఫిట్ నెస్ విషయంలో మహేష్ బాబు తీసుకునే శ్రద్ధ వెరస ఆయన చాలా మందికి రోల్ మోడల్ అయ్యారు. ప్రతి ఒక్కరూ కోరుకునేలా.... సమాజంలో జీవిచడం, ఓ స్థాయికి రావడం, పర్ ఫెక్టుగా లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడం... దీంతో పాటు సిపుల్ లైవ్ స్టైల్ లాంటివి మహేష్ బాబు లాంటి కొందరు స్టార్లకు మాత్రమే సాధ్యం అంటున్నారు ఆయన అభిమానులు.

,  ,  ,  ,  ,