Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 18:45:18
facebook Twitter Googleplus
Photo

మొదట మోడలింగ్ - ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ - నెక్ట్స్ సౌత్ సినిమాల్లో పాగా.. ఇప్పుడు చాలా మందికి ఇదో రూట్ అయిపోయింది. ఇలా చాలామందే వెండితెరపై మెరిసిపోతున్నారు. లారిస్సా బొనేసి - నికోల్ అమీ మాడెల్ - నోరా ఫతేహి - స్కార్లెట్ విల్సన్ లు ఈ జాబితాలో ఉన్న భామలే. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ఎన్నారై సంతతికి చెందిన హాటెస్ట్ మోడల్ ఫరా కరిమి కూడా చేరిపోతోంది.

తేరా సురూర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఈ సుందరి అరంగేట్రంలోనే రామ్ చరణ్ మూవీ ఛాన్స్ దక్కించుకుంది. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చెర్రీ. ధృవ అనే వర్కింగ్ టైటిల్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో విలన్ గా సీనియర్ హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇతని భార్య రోల్ కి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తమిళ్ లో ముగ్ధ గాడ్సే నటించిన ఈ పాత్ర కోసమే.. బాలీవుడ్ భామ కం మోడల్ అయిన ఫరా కరిమిని తీసుకొస్తున్నారు.

సౌత్ లో ఇలాంటి భారీ సినిమాతో అరంగేట్రం చేయడంతో తను చాలా లక్కీ అంటోంది ఫరా కరిమి. ఇప్పటికే ఈమెతో సన్నివేశాల షూటింగ్ ప్రారంభం కాగా.. ధృవ ప్రొడక్షన్ వాల్యూస్ చూసి ఈమె మెస్మరైజ్ అయిపోయిందట. ఇక రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి.. సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా.. సంగీత దర్శక ద్వయం హిప్ హాప్ తమీజాలు మ్యూజిక్ ఇస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,