Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2017 10:52:57
facebook Twitter Googleplus
Photo

హిట్లు లేక సతమతమవుతున్నాడు సీనియర్ దర్శకుడు వంశీ. ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమా లేడీస్ టైలర్ కు సీక్వెల్ ను దించుతున్నాడు. 'ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్ అంటూ వస్తున్న ఈ సినిమా తాలూకు ప్రీ-లుక్ ఎట్టకేలకు బయటకు వచ్చింది.

ఒకమ్మాయి చెస్ట్ దగ్గర కొలతలు తీసుకుంటున్న హీరో. అంతకంటే ఏం కావాలి.. సంచలనాలు క్రియేట్ చేయడానికి. అదేనండీ.. ఉన్నపళంగా జనాలు తన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో వంశీ అదే చేశాడు. ఆ ఐడియా కత్తిలా ఉంది. ఇంతకీ హీరో సుమంత్ అశ్విన్ కొలతలు తీస్తుంది ఏ హీరోయిన్ కు అంటారు? ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ మెయిన్ లీడ్ చేస్తుండగా.. మనాలి రాథోడ్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. తెలుగమ్మాయి మానస 3వ హీరోయిన్ గా కనిపిస్తుందట. ఈ సినిమాకు స్వరాలబ్రహ్మ మణిశర్మ చక్కనైనా బాణీలు అందించాడని తెలుస్తోంది. ఈ సినిమాను మధుర శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ప్రీ లుక్ తో మాంచి బజ్ నే క్రియేట్ చేస్తున్న వంశీ.. ఫస్ట్ లుక్ తో అలాగే ట్రైలర్ తో ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.

,  ,  ,  ,