Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2017 10:48:14
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్టయిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 లో స్టార్ కమెడియన్ పృథ్వీ ఓ చిన్న పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఎడిటింగ్ లో భాగంగా ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లేపేయడం గురించి చిన్న వివాదం తలెత్తింది విడుదలకు ముందు. తన సీన్లు ఎడిటింగ్ లో లేచిపోవడంపై ఫేస్ బుక్ లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్టు పెట్టాడు పృథ్వీ. అతను ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఖైదీ నంబర్ 150 బృందానికి ఇబ్బందికరంగా మారింది. ఐతే చిరంజీవి జోక్యం చేసుకుని.. పృథ్వీ సన్నివేశాలు అలాగే ఉంచేయమనడం.. వినాయక్ అంగీకరించడం.. సినిమాలో పృథ్వీ కనిపించడం.. మొత్తానికి వివాదం సద్దుమణిగిపోయింది.

ఈ వివాదంపై పృథ్వీ తర్వాత ఎప్పుడూ మాట్లాడింది లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దానిపై స్పందించాడతను. తన వ్యాఖ్యల్ని ఒక వెబ్ సైట్ కావాలనే వివాదాస్పదం చేసిందని.. తన వ్యాఖ్యల్నిచిరంజీవి అసలు పట్టించుకోలేదని పృథ్వీ తెలిపాడు. నాకు స్టార్ డమ్ రావడమే ఇబ్బందైంది. అది నాకు వద్దు. మామూలు వేషాలు వేసుకొనేటప్పుడు నా ప్రాణం హాయిగా ఉండేది. లైమ్ లైట్లోకి వచ్చాక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఖైదీ నంబర్ 150 లో చిన్న క్యారెక్టర్ చేశాను. దాన్ని పక్కన పెట్టే హక్కు దర్శక నిర్మాతలకు ఉంది. వాళ్ల సినిమా వాళ్లిష్టం. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయి. నేను క్యాజువల్ గా అన్నదాన్ని ఒక వెబ్ సైట్ వైరల్ గా మార్చేసి రచ్చ చేసింది. నేను ఆ సినిమాకు పని చేసింది రెండే గంటలు. అయినప్పటికీ నేను బాధపడ్డానని అప్పటికే సెన్సార్ చేసిన సినిమాకు మళ్లీ నా సీన్ జోడించి.. మళ్లీ సెన్సార్ జరిపించారు. సినిమా విడుదలయ్యాక చిరంజీవి గారిని వ్యక్తిగతంగా కలిసి 45 నిమిషాలు మాట్లాడాను. నేను ఆ వివాదం గురించి ప్రస్తావించబోతే.. అది అనవసర విషయమని.. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.

,  ,  ,  ,  ,