Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2017 17:12:40
facebook Twitter Googleplus
Photo

శేఖర్ కమ్ముల సినిమా ఫిదా కు పాజిటివ్ టాక్ వచ్చింది. కమ్ముల ఈజ్ బ్యాక్ అంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమాకు ఎ సెంటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం బి-సి సెంటర్లలో మాత్రం పెద్దగా జనాల్ని ఆకర్షించలేకపోతోంది. తొలి రోజు పెద్ద సిటీల్లో మంచి వసూళ్లు వచ్చినప్పటికీ.. చిన్న నగరాలు.. పట్టణాల్లో ఆశించి స్పందన లేదు. ఆక్యుపెన్సీ లేక థియేటర్లు డల్లుగా కనిపించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరుణ్ తేజ్ చివరి సినిమా మిస్టర్ డిజాస్టర్ అయినప్పటికీ మాస్ సెంటర్లలో దానికి తొలి రోజు మంచి స్పందనే వచ్చింది. హౌస్ ఫుల్స్ పడ్డాయి. కానీ ఫిదా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దానికి ఆశించిన స్పందన లేదంటున్నారు.

మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాలు అర్బన్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్టవుతుంటాయి. హ్యాపీడేస్ యూత్ ఫుల్ మూవీ కావడంతో అది ఎక్కువ మందికి చేరువైంది. మిగతా సినిమాలేవీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఎ సెంటర్ల ఆడియన్స్ మాత్రమే ఆ సినిమాల్ని ఆదరించారు. ‘ఫిదా’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇందులోని క్లాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ ప్రేక్షకులకు ఎంతవరకు ఎక్కుతుందన్నది సందేహమే. ఫస్టాఫ్ అయినా కామెడీతో నడిచిపోతుంది కానీ.. సీరియస్ గా.. సాగతీతగా అనిపించే ద్వితీయార్ధాన్ని మాస్ ప్రేక్షకులు తట్టుకోవడం కష్టమే. ఆ వర్గం ప్రేక్షకులు తొలి రోజే నిరాశ వ్యక్తం చేశారు. కాబట్టి బి-సి సెంటర్లలో ఫిదా సేఫ్ జోన్లోకి రావడం కష్టమే అంటున్నారు.

,  ,  ,  ,  ,