Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 13:55:27
facebook Twitter Googleplus
Photo

హిట్టుతో ఫ్లాపుతో పనిలేకుండా వరుసపెట్టి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడంటే.. అసలు మనోడి స్పీడ్ ఏ రేంజులో ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడిక కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ కుక్కల కిడ్నాపర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రలైర్లు మాంచి హైప్ తెచ్చేశాయి.

మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు బాగా సంపాదిస్తున్న రాజ్ తరుణ్ హైదారబాద్ లో సొంతంగా ఒక ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఈ సంవత్సరం జూన్ నాటికి ఆ ఇంటి పనులు పూర్తయిపోతాయ్. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి తన కలల సౌధంగా ఆ ఇంటిని రూపకల్పన చేయించాడట ఈ యంగ్ హీరో. మరి కొత్త ఇల్లు 2017లో రెడీ అయిపోతోంది బాగానే ఉంది.. ఆ ఇంట్లో విత్ ఇల్లాలు ఉంటే బాగుంటుంది కదా అంటే.. 2019 నాటికి ఇల్లాలు కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నా.. అప్పటికి పెళ్ళి చేసేసుకుంటా అంటూ నవ్వేశాడు ఈ యంగ్ స్టార్.

,  ,  ,  ,