Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2015 11:37:46
facebook Twitter Googleplus
Photo

మరో బాలీవుడ్ నటుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. పైగా, పవన్ కల్యాణ్ నటించే చిత్రం ద్వారా అతను పరిచయం కావడం ఇక్కడ విశేషం. అతని పేరు శరద్ కేల్కర్! పలు హిందీ సీరియల్స్ ద్వారా పేరుతెచ్చుకున్న ఈ నటుడు హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్ 2' సినిమాలోని ప్రధాన విలన్ పాత్రకు ఈ నటుడిని ఎంచుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కి ప్రతినాయకుడుగా ఓ కొత్త నటుడు వుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇతనిని సెలెక్ట్ చేసుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ జరుగుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,