లవ్ స్టోరీ అయినా.. యాక్షన్ మూవీ అయినా.. సబ్జెక్ట్ ఏదైనా తన స్టైల్ లో ఆకట్టుకోవడం గౌతమ్ మీనన్ స్పెషాలిటీ. ఒకే సబ్జెక్టును రెండేసి యాంగిల్స్ లో తీస్తూ అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ ఆడియన్స్ కు షాక్ ఇస్తూ ఉంటాడు. ద్విభాషా చిత్రం అంటే ఒకేలా తీయడం కాదు.. ఒకే సబ్జెక్ట్ ని ఎక్కడికి తగినట్లుగా ఆ భాషలో తీయడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత.
ఇప్పుడు చైతుతో తీసిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి మంచి టాక్ రావడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు ఈ దర్శకుడు. 'నోట్ల రద్దు అంశం మా సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించింది. అయినా సరే మంచి వసూళ్లే వస్తున్నా. ఏమాయ చేశావే టైం కంటే చైతు బాగా మెచ్యూర్ అయ్యాడు. ఏ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది' అన్న గౌతమ్ మీనన్.. 'ఒకే కథను రెండు భాషల్లో తెరకెక్కించడం నాకు కిక్ ఇస్తుంది. కథ రాసేటప్పుడే రెండు భాషలకు నప్పేలా రాస్కుంటా. హీరో కోసం స్టోరీ రాయను. నా స్టోరీకి తగినట్లుగానే హీరోని ఎంచుకుంటా. ఒకే సీన్ ని తెలుగు హీరోతో ఒక రకంగా.. తమిళ్ హీరోతో మరో రకంగా తెరకెక్కిస్తా. అందులో నాకు చాలా కిక్ వస్తుంది' అంటున్నాడు.
నాగచైతన్యను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఉందంటున్న గౌతమ్ మీనన్.. త్వరలో తమిళ్.. తెలుగు.. కన్నడ భాషల ఆడియన్స్ కు నప్పేలే త్రిభాషా చిత్రం తీస్తానంటున్నాడు.