Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:05:55
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ మూవీస్ అందులోనూ బాలీవుడ్.. టాలీవుడ్ సినిమాలంటే ఫక్తు కమర్షియల్. మసాలాలన్నీ లెక్కప్రకారం వేసి చేసిన వంటలా ఉంటాయ్ మన సినిమాలు. 3 ఫైట్లు.. 6 పాటలు రొటీన్ టెంప్లెట్లో రన్నయ్యే స్టోరీ. ఇక హీరోని ఓ రేంజ్ లో చూపించాలి. స్టార్టింగ్ సీన్ నుంచే హీరోయిజం కనిపించాలి. ఇంట్రడక్షన్ సాంగ్ కంపల్సరీ. హీరో రేంజ్ ఏదైనా సరే ఈ విషయంలో మాత్రం అస్సలు తేడా రావడానికి వీల్లేదు. లేకపోతే ఫ్యాన్స్ ఫీలవుతారంటూ ఎవరికి వాళ్లు డైలాగ్స్ వేస్తారు. అయితే ఈ ట్రెండ్ ని బ్రేక్ చేయబోతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ.

అప్ కమింగ్ మూవీ నక్షత్రంలో హీరో బిల్డప్ బదులు హీరోయిన్ రెజీనా మీద బాగా ఫోకస్ పెట్టిన్నట్టున్నాడు క్రిష్ణవంశీ. అందుకే రొటీన్ గా వచ్చే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ప్లేస్ లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ తీయబోతున్నాడు. రెజీనాతో పాటు ఈ సాంగ్ లో 400 మంది సైడ్ డ్యాన్సర్స్ కనిపించనున్నారు. అలాగే హీరోయిన్ 15కి పైగా కాస్ట్యూమ్స్ మారుస్తుందట. అవును మా మూవీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉందని మూవీ యూనిట్ కన్ఫామ్ చేసింది కూడా.

నిజానికి హీరోయిన్స్ కి ఓ సోలో సాంగ్ ఉండటం కొత్త ట్రెండేమీ కాదు. 80- 90 సినిమాల్లో ఆల్ మోస్ట్ ప్రతీ హీరోయిన్ కి ఓ సింగిల్ సాంగ్ ఉండేది. టోటల్ గా ఇంట్రడక్షన్ కాకపోయినా ఇంచుమించు అలాగే అనిపించేవి ఆ పాటలు. కాకపోతే మూవీస్ లో హీరో కేరెక్టర్ కి వెయిట్ పెరిగిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో అలాంటివి బొత్తిగా కనిపించడం మానేశాయ్. మళ్లీ ఇప్పుడు క్రిష్ణవంశీ పాత ట్రెండ్ కి కొత్త కలరింగ్ ఇవ్వబోతున్నాడు. అసలే హీరోయిన్స్ ని అందంగా చూపించాలంటే క్రిష్ణవంశీ తర్వాతే. మరి ఈ దెబ్బతోనైనా రెజీనా ఫేట్ మారిపోతుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,