Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:25:06
facebook Twitter Googleplus
Photo

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఒకట్రెండుసార్లు చరణ్ కూడా గౌతమ్తో చేయాలనుందని చెప్పాడు. కానీ చరణ్ ఖాళీగా ఉన్నప్పుడు గౌతమ్ బిజీగా ఉండటం - గౌతమ్ ఖాళీగా ఉన్నప్పుడు చరణ్ ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటుండడంతో వీళ్లిద్దరి కలయికలో సినిమా సాధ్యం కాలేదు. గౌతమ్ మీనన్ సినిమా చేస్తే అది రెండు భాషల్లో వర్కవుట్ అయ్యేలా ఉండాలనుకొంటాడు. ఏమాయ చేసావె - ఎటో వెళ్లిపోయింది మనసు - సాహసం శ్వాసగా సాగిపోలాంటి సినిమాల తరహాలో ఇటు తెలుగు - అటు తమిళం భాషల్లో తెరకెక్కిస్తుంటాడు. ఆ తరహాలో చిత్రాల్ని తెరకెక్కించాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. రామ్ చరణ్ లాంటి స్టార్ కథానాయకులు ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు సమయం కేటాయించలేరు. అందుకే ఆ కాంబినేషన్లలో సినిమాలు తెరకెక్కడం కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.

అయితే గౌతమ్ మీనన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొన్నాడు. తెలుగు - తమిళం భాషల్లో మార్కెట్టున్న నానితోనే మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతోందని తెలుగు మీడియాతో స్పష్టం చేశాడు గౌతమ్ మీనన్. నాని కూడా తమిళంలో సినిమా చేయక చాలా రోజులైంది. అందుకే గౌతమ్ మీనన్ సినిమా అనగానే ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఆ ప్రాజెక్టు గురించి అధికారికంగా వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఎటో వెళ్లిపోయింది మనసు తర్వాత గౌతమ్ మీనన్ - నాని కలుస్తుండడంతో ఆ ప్రాజెక్టుపై తెలుగు - తమిళ భాషల్లో ఆసక్తి నెలకొంది.

,  ,  ,  ,  ,