Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:42:45
facebook Twitter Googleplus
Photo

తమిళనాట ఇప్పుడు హీరోలతో సమానంగా ఇమేజ్ తో దూసుకెళ్తోంది నయనతార. ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ హార్రర్ థ్రిల్లర్ మాయ (తెలుగులో మయూరి) మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. లేటస్టుగా అధ్వర్వ పక్కన నయన్ కథానాయికగా నటిస్తున్న సినిమా ?ఇమైక్క నోడిగల్?. ఇందులో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. అతను తొలిసారి పూర్తి స్థాయి పాత్ర చేస్తున్నది ఈ సినిమాలోనే. ఇంతకుముందు ?కాక్క కాక్క? సహా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేశాడు గౌతమ్ మీనన్.

ఈ మధ్య ఓ మలయాళ సినిమాలో విలన్ పాత్ర ఆఫర్ చేసినా తిరస్కరంచిన గౌతమ్.. ?ఇమైక్క నోడిగల్? చిత్రంలో మాత్రం పాత్ర నచ్చి విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడు. ?డిమాంటి కాలనీ? సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అజయ్ అనే యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గౌతమ్ స్టైలిష్ విలన్ గా కనిపిస్తాడట. ఇక దర్శకుడిగానూ తీరిక లేకుండా ఉన్నాడు గౌతమ్. ప్రస్తుతం అతను ధనుష్ హీరోగా ?ఎన్నై నొక్కి పాయుం తోట్ట? అనే సినిమా చేస్తున్న గౌతమ్.. ఈ ఏడాదే మరో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తోనూ గౌఃతమ్ ఓ సినిమా చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,