Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 14:01:40
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద చర్చ పాత నోట్లు వర్సెస్ పెద్ద నోట్లు. కొత్త నోట్లు చాలామంది దగ్గరే కనిపిస్తున్నాయ్ కానీ.. మంచు విష్ణు దగ్గర కట్టలు కట్టలుగా కొత్త నోట్లు కనిపించేశాయ్. అసలు విష్ణు ఇన్ని నోట్ల కట్టలు.. అది కూడా కొత్త నోట్లతో కనిపించడం అంటే.. నిజంగా ఈ మంచు హీరోను లక్కున్నోడు అనాల్సిందే.

అయితే.. ఇదంతా కూడా లక్కున్నోడు మూవీ గురించే లెండి. ఇవాళ మంచు విష్ణుకి హ్యాపీ బర్త్ డే. అందుకే లక్కున్నోడు మూవీ యూనిట్.. ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో మంచు విష్ణు ఫుల్లు హ్యాపీగా డ్యాన్సులు వేస్తుంటే.. ముందు వెనకా బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఫ్లార్ మీదా అంతా కొత్తగా విడుదలైన 2వేల రూపాయల నోట్ల కట్టలే ఉంటాయి. ఇన్నేసి కట్టలుగా కొత్త నోట్లు.. అది కూడా పుట్టిన రోజున అంటే విష్ణును లక్కున్నోడు అనాల్సిందే కదా.

గతంలో కూడా లక్కున్నోడు పోస్టర్ ను ఈ మాదిరిగానే ఇచ్చారు కానీ.. అప్పుడు పాత నోట్లు దర్శనమిచ్చాయ్. ఇప్పుడు మాత్రం టైమింగ్ కి తగినట్లు.. అన్నీ కొత్త నోట్లు డిజైన్ చేశారు. ఆ పాత నోట్ల స్థానంలో ఇప్పటి ట్రెండ్ కి టాపిక్ కి తగినట్లు కొత్త నోట్లను థీమ్ గా వాడడం.. బాగా సెట్ అయింది.

,  ,  ,  ,  ,