Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:13:44
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ?గౌతమీపుత్ర శాతకర్ణి? సినిమా పాటలు నిన్న రాత్రి విడుదలయ్యాయి. కాంబినేషన్ క్రేజ్.. దీని కథాంశం.. సినిమా మీద ఉన్న అంచనాల దృష్ట్యా.. ఆడియో కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. భారీ అంచనాలతో ఉన్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు ఈ ఆడియో. ?గౌతమీపుత్ర శాతకర్ణి?లోని ఐదు పాటలూ వేటికవే ప్రత్యేకం. ?కంచె? సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చిరంతన్.. తొలి సినిమాకు మంచి పాటలే ఇచ్చాడు కానీ.. అవి అంతగా పాపులర్ కాలేదు. కానీ ?గౌతమీపుత్ర శాతకర్ణి? పాటలు మాత్రం జనాల్లోకి బాగానే వెళ్లేలా ఉన్నాయి.

అన్ని పాటల్లోకి అగ్ర తాంబూలం.. ?సాహో సార్వభౌమ? పాటకే. సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా.. రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ పాటను ట్యూన్ చేశాడు చిరంతన్. విజయ్ ప్రకాష్ గానం కూడా అదే స్థాయిలో సాగింది. తర్వాత బాలసుబ్రమణ్యం-శ్రియ ఘోషల్ పాడిన మృగనయనా వినసొంపుగా ఉంది. ఇక ఉదిత్ నారాయణ-శ్రియ ఘోషల్ కలిసి గానం చేసిన ?ఏకి మేడ? పాట వైవిధ్యంగా.. శ్రావ్యంగా ఉంది. సింహా.. ఆనంద్ భాస్కర్.. వంశీ కలిసి పాడిన ?గణగణగణ...? ఒక నాయకుడు తన సైన్యంలో స్ఫూర్తి నింపుతూ గానం చేసే పాట. ఇది స్ఫూర్తిమంతంగా ఉంది. సింగముపై లంఘించెను అంటే సాగే పాట బుర్ర కథ నేపథ్యంలో వస్తుంది. దీన్ని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మీద తీశారు. ఈ పాట పర్వాలేదనిపిస్తుంది. అన్ని పాటల్లోనూ సీతారామశాస్త్రి కలం బలం కనిపిస్తుంది. వైవిధ్యమైన.. ఇంటెన్సిటీ ఉన్న ట్యూన్లతో చిరంతన్ భట్ తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాకు తన ఎంపిక సరైందే అని రుజువు చేశాడు.

,  ,  ,  ,  ,