Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 12:09:38
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో ఏడాది కిందట విడుదల కావాల్సింది సాహసం శ్వాసగా సాగిపో సినిమా. తెలుగు వెర్షన్ పని ఎప్పుడో ముగిసిపోయినా విడుదలకు నోచుకోలేదు. ఇందుకు తమిళ వెర్షన్ ఆలస్యం కావడం కారణం. ఐతే గౌతమ్ మీనన్ మీద గౌరవంతో ఎంతో ఓపిక పట్టాడు చైతూ. ఈ సినిమా వల్ల చైతూ డేట్లు చాలా నష్టపోయాడు. కెరీర్లో అనుకోకుండా గ్యాప్ కూడా వచ్చేసింది. దీని కోసమని ప్రేమమ్ సినిమాను కూడా రెండు మూడు నెలల పాటు వాయిదా వేయించాడు.

ఇక లాభం లేదని.. ?ప్రేమమ్?ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయితే.. దాని కోసం ప్రకటించిన రిలీజ్ డేట్ లోనే ?సాహసం..? సినిమాను రిలీజ్ చేస్తానని ప్రకటించి షాకిచ్చాడు గౌతమ్. అప్పట్లో ఈ విషయమై గౌతమ్ కు.. చైతూకు అభిప్రాయభేదాలు కూడా వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ?సాహసం..? రిలీజవగా.. ఈ సినిమా ప్రమోషన్ గురించి అసలేమీ పట్టించుకోకుండా తమిళ వెర్షన్ గురించే గౌతమ్ ఊదరగొట్టడంతో అంతకముందున్న సందేహాలు నిజమేనేమో అన్న అనుమానాలు కలిగాయి.

ఐతే ఎట్టకేలకు గౌతమ్ మీనన్ తెలుగు మీడియా ముందుకొచ్చాడు. ?సాహసం..? సినిమాను ప్రమోట్ చేశాడు. ఇంటర్వ్యూలిచ్చాడు. ఈ సందర్భంగా నాగచైతన్యకు.. తనకు విభేదాలేమీ లేవని కూడా స్పష్టం చేశాడు. అతడితో ఇంకో సినిమా కూడా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ??చైతూతో నా రిలేషన్ చాలా బాగుంది. అతను నాతో తమ్ముడి లాగా ఉంటాడు. తనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ?ఏమాయ చేసావె? సమయానికి ఇప్పటికి చైతూ వ్యక్తిగా ఏం మారలేదు. నటుడిగా ఎదిగాడు. అతడితో ఇంకో సినిమా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి చైతూకు అలాంటి ఉద్దేశం ఉందో లేదో తెలియదు మరి?? అన్నాడు గౌతమ్.

,  ,  ,  ,  ,