Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 14:42:14
facebook Twitter Googleplus
Photo

వరుస హిట్స్‌తో జోరు మీదున్న నాని, అదే ఉత్సాహంతో తన కొత్త సినిమా ?జెంటిల్‌మన్‌?ను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ?అష్టాచమ్మా?తో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో కలిసి నాని చేసిన ఈ సినిమా, నేటితో సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు పక్కాగా సిద్ధమైపోయింది. సెన్సార్ బృందం ?జెంటిల్‌మన్? సినిమాకు ?యూ? సర్టిఫికెట్ జారీ చేసింది.
ఇక ఇదే విషయాన్ని నాని తెలియజేస్తూ తమ సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చిందని, అందరూ చూడదగ్గ సినిమా ?జెంటిల్‌మన్? అని తెలిపారు. ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇక సెన్సార్ కూడా పూర్తవడంతో టీమ్ నేటినుంచి ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. నాని సరసన సురభి, నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,