Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 16:32:06
facebook Twitter Googleplus
Photo

ఇండియాలో సబ్ మెరైన్ థీమ్ తో వచ్చిన మొదటి మూవీగా రికార్డ్ సృష్టించిన ఘాజీ.. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు.. హిందీ భాషల్లో రూపొందిన ఘాజీ.. తమిళ్ లో డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు. మొత్తం మూడు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి రివ్యూలు రేటింగులు వచ్చాయి. సినిమా మొత్తం అండర్ వాటర్ లోనే తీసినా.. ఓ హాలీవుడ్ స్థాయి మూవీ చూశామనే ఫీలింగ్ కలిగించారనే మౌత్ టాక్ ఈ చిత్రానికి బాగా హెల్ప్ అవుతోంది.

తొలి రోజున మూడు భాషల్లోను కలిపి ఘాజీకి 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్ చేసిన థియేటర్స్ కౌంట్ ప్రకారం చూసుకుంటే.. ఈ మొత్తం తక్కువ అనే అనిపిస్తుంది కానీ.. అసలు పాటలు.. ఫైట్స్ లాంటి ఎలాంటి కలర్ ఫుల్ ఎట్రాక్షన్స్ లేని సినిమాకి ఇంత భారీ మొత్తం వసూళ్లు అంటే విశేషమే. పైగా సంకల్ప్ రెడ్డి అనే కొత్త కుర్రాడు తీసిన మూవీకి.. ఈ స్థాయి రెస్పాన్స్ అస్సలు ఊహించలేం. ఇప్పుడు మూవీకి జనాల టాక్ కూడా బాగుండడంతో.. వీకెండ్స్ లో మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంపై నిర్మాతలు వెచ్చించిన మొత్తం భారీగానే ఉంది కానీ.. మూవీపై నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా తామే రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఘాజీకి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే.. ప్రొడ్యూసర్ల నిర్ణయం సరైనదే అనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,