Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2016 11:47:23
facebook Twitter Googleplus
Photo

సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ?అభినేత్రి? అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ లేడీ ఓరియంటడ్ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా హిందీ వర్షన్‌కు ?2 ఇన్ 1? అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
అదేవిధంగా నిన్న ఈ వర్షన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ విడుదల చేశారు. తమన్నాతో పాటు సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన సోనూసూద్ జాకీచాన్ నటించిన కుంగ్‌ఫూ పాండా అనే ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జాకీచాన్‌తో స్నేహం పెంచుకున్న సొనూసూద్, నిన్న ప్రత్యేకంగా జాకీచాన్‌ చేత ఫస్ట్‌లుక్ విడుదల చేయించారు. ఓ సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,