Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 18:03:33
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు ?బ్రహ్మోత్సవం? సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక శుభవార్త. సాధారణంగా సింగల్ స్క్రీన్స్ లో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అయ్యే షో మహేష్ బాబు అభిమానుల ఆకాంక్ష మేరకు ?బ్రహ్మోత్సవం? విడుదల అవుతున్న మే 20 న ఉదయం 8 గంటల10 నిమిషాలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలియచేశారు. అదీ కూడా ఆ ఒక్క రోజు మాత్రమే హైదరాబాద్, మరియు తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో ?బ్రహ్మోత్సవం? ప్రత్యేక ప్రదర్శన ఈ సమయంలో ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన రోజూ ఐదు ఆటలు ఉత్తర్వ్యులు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. అది ఈ సినిమాతో మొదలు పెడుతున్నట్లు అదీకూడా ఆ ఒక్కరోజు మాత్రమే అని తెలిసింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ?సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు? సినిమా తరువాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో పాటు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

,  ,  ,  ,  ,