Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 14:40:36
facebook Twitter Googleplus
Photo

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. అది రాదు.. వీడు మార‌డు అనే చ‌క్క‌టి క్యాప్ష‌న్ ని కూడా పెట్టారు. ఈ చిత్రాన్ని IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా నిర్మాత‌లు కిర‌ణ్ జ‌క్కంశేట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార‌త‌దేశంలో నే మెట్ట‌మెద‌టి సారిగా ట్విన్స్ ధ‌ర్మ‌-ర‌క్ష అనే వారు సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌లు స్వీక‌రించారు. ప్రియ‌ల్ గోర్ అనే నూత‌న తార హీరోయిన్ గా చేస్తుంది. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ కి గ్రాండియ‌ర్ విజువ‌ల్స్ తోడ‌యితే ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌ని క‌నువిందు చేస్తుంది. ఇప్ప‌టికే టాకీ మెత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. IEF CORPORATION - Italian of the East Films corporation ప్రోడ‌క్ష‌న్ లొ కంటిన్యూస్ గా చిత్రాలు చేయ్యాల‌నుకున్న‌ప్పుడు ట్విన్స్ ధ‌ర్మ‌-ర‌క్ష లు ఇద్ద‌రు వ‌చ్చి క‌థ చేప్పారు. రియ‌ల్ గా చాలా అంటే చాలా బాగా న‌చ్చింది. 3 వేరియేష‌న్స్ ఆఫ్ ల‌వ్‌స్టోరి ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కి హ‌ర్ట్ కి ట‌చ్ అయ్యే చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంత మంచి ప్రేమ‌క‌థ కి హీరో ఎవ‌రా అనుకుంటున్న‌ప్పుడు న‌వీన్ చంద్ర గుర్తోచ్చారు అంద‌రికి. వెంట‌నే న‌వీన్ ని అప్రోచ్ అయ్యాము. న‌వీన్ విన్న వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చెయ్య‌కుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.త‌రువాత ప్రేమ‌క‌థ కి హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్య‌త వుంటుంది కాబ‌ట్టి ల‌వ్‌బుల్ గ‌ర్ల్ ప్రియ‌ల్ గోర్ ని సెల‌క్ట్ చేశాము. ఇలా అంద‌రూ సెల‌క్ట్ అయ్యాక ఈ చిత్రాన్ని హిల్ స్టేష‌న్ లో షూట్ చేస్తే నేచుర‌ల్ బ్యూటి క్యాప్చ‌ర్ చెయ్య‌చ్చుక‌దాని హిమాలయాల్లో ని అంద‌మైన ప్ర‌దేశాల్లో మైన‌స్ డిగ్రి కోల్డ్ వాతావ‌ర‌ణంలో అత్య‌ద్బుతం గా మెద‌టి షెడ్యూల్ ని చిత్రీక‌రించాము. త‌రువాత గోవాలొ ఎక్స్‌ట్రీమ్ హ‌ట్ లో రెండ‌వ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాము. మూడ‌వ షెడ్యూల్ హైద‌రాబాద్ లోని ఎక్ట్రీమ్ రెయిన్స్ వున్నప్పుడు షూట్ చేశాము. మా చిత్రం మూడు వేరియేష‌న్స్ వున్న ల‌వ్ స్టోరి , మేము చేసిన షూటింగ్ కూడా మూడు వేరియేష‌న్స్ క్టైమెట్స్ కావ‌టం కాక‌తాళియంగా భావిస్తున్నాము. ఇంత చ‌క్క‌టి ప్రేమ‌క‌థ కి చంద‌మామ రావే అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. అది రాదు..వీడు మార‌డు అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాము. ఈ టైటిల్ మా ద‌ర్శ‌కులు చెప్ప‌గానే మా యూనిట్ స‌భ్యులంద‌రూ ఏక‌గ్రీవంగా అంగీకరించారు. ఈ టైటిల్ ప్రేక్ష‌కులంద‌రికి న‌చ్చే టైటిల్ గా వుంటుంద‌ని మా న‌మ్మ‌కం. టైటిల్ వున్న‌ట్టుగానే మా చిత్ర క‌థ చంద‌మా క‌థ లా వుంటుంది. మా ట్యాగ్ లైన్ లానే మా హీరో పాత్ర వుంటుంది. చంద‌మామ లాంటి మా హీరోయిన్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం లో చాలా ఆశక్తిక‌ర‌మైన అంశాలుంటాయి. న‌వీన్ చంద్ర ఏప్పుడూ చెయ్య‌ని విధంగా కొత్త న‌వీన్ చంద్ర ని ఈ చిత్రంలో చూస్తారు. మా ద‌ర్శ‌కుడు ధ‌ర్మ‌-ర‌క్ష లు కూడా చాలా క్రీయోటివిటి గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అని అన్నారు


బ్యాన‌ర్‌- IEF CORPORATION - Italian of the East Films corporation
కెమెరా- వెంక‌ట ప్ర‌సాద్‌
సంగీతం- శ్రావ‌ణ్‌
ఎడిట‌ర్‌- ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
ద‌ర్శక‌త్వం- ధ‌ర్మ‌-ర‌క్ష‌

,  ,  ,  ,  ,