Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2015 10:30:02
facebook Twitter Googleplus
Photo

వాయిదా పడిన 'గోపాల గోపాల' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U సర్టిఫికేట్ లభించిందని నిర్మాతలు తెలిపారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారట. మంచి ఎంటర్ టైనర్ అవుతుందని నిర్మాతలను వారు అభినందించడం కూడా జరిగింది. దీంతో ఈ నెల 10న శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, వెంకటేష్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించే చిత్రమిదని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. పవన్ మోడరన్ కృష్ణుడిగా నటించగా, ఆయన భక్తుడిగా వెంకటేష్ నటించారు. డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు,

,  ,  ,  ,  ,  ,