Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 12:32:27
facebook Twitter Googleplus
Photo

మొన్నటివరకు అవకాశాలు రాకపోవడానికి ఒకటే పాట పాడేసింది నడుం సన్నజాజి ఇలియానా. తాను మంచి పాత్రలు వస్తేనే చేస్తానని లేకపోతే చేయనని చెప్పింది. ఆ తరువాత అవకాశాల కోసం నానా పాట్లు పడింది. బికినీల్లో ఫోజులు ఇచ్చింది.. న్యూడ్ గా స్టిల్స్ దిగింది.. అవన్నీ అందరితోనూ షేర్ చేసింది. అయితే అమ్మడి కటింగ్ అక్కడితో ఆగలేదుగా.

ఇప్పుడు బాద్షాహో వంటి సినిమాల్లో నటిస్తున్న ఇలియానా.. మరోసారి పాత పాటనే పాడటం మొదలెట్టింది. ఆల్రెడీ హ్యాపీ ఎండింగ్ సినిమా తరువాత సంవత్సరానికి కాని రుస్తుం సినిమా రాలేదు. ఇప్పుడేమో అమ్మడు మరోసారి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తోంది. నాకు అసలు కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం ఉండదు.. అలాంటి రోల్స్ చేయడం నాకు కష్టం. అందుకే సినిమాలు సైన్ చేయడం లేదు అంటూ బాంబ్ పేల్చింది. అయితే నిజంగా ఇలియానా వెనుక పరిగెత్తేసి అంతేసి ఛాన్సులు ఎవ్వరు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి కామెంట్లు ఎందుకు భామా?

ఇకపోతే తనను పెళ్ళి గురించి పెద్దగా ప్రశ్నలు అడగొద్దని.. ఎందుకంటే తనకు అలాంటి విషయాలు మాట్లాడటం ఇష్టం ఉండదని.. పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతానని సెలవిచ్చింది అమ్మడు.

,  ,  ,  ,  ,  ,  ,