Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 12:34:19
facebook Twitter Googleplus
Photo

హీరోగా అడపదడప హిట్స్ తో నలుగురు అభిమానుల్ని నాలుగు రాళ్లని సంపాదించుకుంటూ కెరీర్ సాగిస్తున్నాడు గోపీచంద్. ఈ హీరోగారు నటించిన మూడు సినిమాలు ప్రస్తుతం విడుదలకి రెడీ గా ఉన్నాయి. వాటిలో బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ - దాదాపు రెండేళ్ల నుంచి విడుదలకి నోచుకోవడం లేదు. ఈ మధ్య దాదాపు విడుదలయ్యే టైమ్ కి ఫైనాస్స్ ప్రాబ్లమ్స్ కారణంగా థియేటర్లో బొమ్మ పడలేదు.

దీంతో గోపీచంద్ ఈ సినిమాని పక్కనపెట్టేసి సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందిన గౌతమ్ నంద పై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ సినిమా జూలై 28న విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటణ వచ్చింది. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గౌతమ్ నంద రిలీజ్ కాగానే అక్సీజన్ విడుదల కూడా ప్లాన్ చేసుకున్నాడు గోపీచంద్. ఆక్సీజన్ రిలీజ్ డేట్ ను ఆగస్ట్ 18కి ఫిక్స్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఆక్సీజన్ కూడా అనుకున్న ప్రకారం విడుదలయ్యే అవకాశం లేదట. అయితే ఇదంతా గోపీచంద్ తన హోమ్ బ్యానర్ ను వదులుకోవడం కారణం గానే జరుగుతుందని తెలిసింది.

గోపీచంద్ తన కెరీర్ లో ఎక్కువుగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నటించాడు. గోపీచంద్ కెరీర్ గాఢి తప్పిన ప్రతీసారీ భవ్య వారు ఏదోక హిట్ ఇచ్చిఈ హీరోని ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఇటీవలే వచ్చిన డిజాస్టర్ మూవీ సౌఖ్యం - గోపీచంద్ కి భవ్య క్రియేషన్స్ వారికి వివాదాలు తెచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదైతేనేం గోపీచంద్ భవ్యవారితో కటీఫ్ చెప్పడం కరెక్ట్ కాదని సినీ జనాలు అభిప్రాయపడుతన్నారు.

,  ,  ,  ,