Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 10:57:02
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్యతో సమంత.. టాలీవుడ్ లో ఇది క్రేజీ కాంబినేషన్. రియల్ లైఫ్ లో లవర్స్ అనే టాక్ సంగతి పక్కన పెడితే.. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జంట భలే చూడముచ్చటగా ఉంటుంది. తన తొలి సినిమా ఏ మాయ చేశావే చిత్రంలోనే చైతుతో సూపర్బ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన సమంత.. తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసింది. ఆటోనగర సూర్య మనం చిత్రాల్లో కూడా చైతు సరసన నటించింది శామ్స్.

తనకు అందరికంటే నాగచైతన్యతో నటించడం అంటేనే కన్వీనియెంట్ గా ఉంటుందని ఈ చెన్నై చిన్నది గతంలో తెగేసి చెప్పేసింది. ఇప్పుడీ జంటను నాలుగోసారి కలుపుతూ రొమాన్స్ పండించేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్ధమవుతున్నాడు. సోగ్గాడి చిన్ని నాయనతో నాగార్జునకు కెరీర్ బిగ్గెస్ట్ అందించిన ఈ డైరెక్టర్.. నాగచైతన్యతో ఓ వండ్రఫుల్ లవ్ స్టోరీ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే స్టోరీ చెప్పడాలు ఒప్పుకోవడాలు అన్నీ పూర్తయిపోగా.. జూలైలో షూటింగ్ ని ప్రారంభించేదుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ప్రేమమ్ చిత్రాన్ని కంప్లీట్ చేస్తున్న చైతు.. అది పూర్తవగానే కళ్యాణ్ కృష్ణ చిత్రాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. మరోవైపు సమంత కూడా జనతా గ్యారేజ్ లో తన రోల్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను ఫినిష్ చేసుకుని.. చైతు చెంతకు చేరనుంది. రీసెంట్ టైమ్ లో రామ్ చరణ్-కాజల్ తర్వాత.. నాలుగోసారి జత కట్టిన పెయిర్ గా నాగచైతన్య-సమంతలు నిలవనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,