Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2016 15:33:04
facebook Twitter Googleplus
Photo

ఎంతవారలైనా కాంత దాసులే అని ఓ మాట ఉంటుంది.. దాన్ని కొంచెం మారిస్తే ఎంత వారలైనా పిల్లలకు దాసులే అని కూడా చెప్పుకోవచ్చు. పిల్లల విషయంలో ఎలాంటి వ్యక్తి అయినా ఓ సగటు తండ్రిలా మారిపోవాల్సిందే. మహేష్ బాబు ఒకప్పుడు ఎలా ఉండేవాడు. కానీ గౌతమ్ పుట్టాక అతడిలో ఎంతో మార్పు చూశాం. ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా అంతే. ఎంత పెద్ద హీరోలైనా సరే పిల్లల దగ్గరికి వచ్చేసరికి సగటు తండ్రుల్లా మారిపోతారు.

ఈ కోవలోకి ఇప్పుడు గోపీచంద్ కూడా చేరాడు. తన ముద్దుల కొడుకు విరాట్ పుట్టిన రోజు వేడుకలో గోపీచంద్ సరికొత్తగా కనిపించాడు. తన కొడుకు విరాట్ తో ఆడుకుంటూ ఖుషీ ఖుషీగా కనిపించాడు. 2013లో గోపీ.. సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీళ్లిద్దరికీ కొడుకు పుట్టాడు. అతడికి విరాట్ అని పేరు పెట్టుకున్నాడు గోపీ. ఇటీవలే పుట్టిన రోజు వేడుకను అంగరంగ వైభవంగా చేసిన గోపీ.. కొడుకుతో భార్యతో ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

,  ,  ,