Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2015 10:35:06
facebook Twitter Googleplus
Photo

అందానికీ .. చురుకుదనానికి చిరునామాగా బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకునే పేరు ఆలియాభట్. యూత్ చూపులను ఇప్పుడామె తన చుట్టూ తిప్పుకుంటోంది. బాలీవుడ్లోనే కాదు .. హిందీ సినిమాలతో పరిచయమున్న కోలీవుడ్ .. టాలీవుడ్ కుర్రాళ్లకు సైతం ఈ పేరు మంత్రమైపోయింది. అందుకే తమ హీరోల సరసన ఆమె ఒక్క సినిమా అయినా చేయక పోతుందా అనే ఆసక్తితో వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ప్రభాస్ తాజా చిత్రంలో కథానాయిక కోసం ఆమెని సంప్రదించనున్నారనేదే ఆ వార్త సారాంశం.

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. టాలీవుడ్ సినిమాలు చేయడానికి ఆలియాభట్ ఆసక్తిని చూపుతుందని తెలిసి ఆమెని సంప్రదించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె హైటు తక్కువ కాబట్టి, మరో ఆలోచన చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,