Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Mar-2017 10:53:23
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ మలినేని ఇప్పుడు సూపర్ స్పీడ్ మీద ఉన్న డైరెక్టర్. వరుసగా కమర్షియల్ మూవీస్ చేయడం.. వరుసగా కమర్షియల్ హిట్స్ కొట్టడం ఈ దర్శకుడికి బాగా అలవాటయిపోయింది. డాన్ శీనుతో దర్శకుడిగా మారిన గోపీచంద్.. ఆ తర్వాత బాడీగార్డ్.. బలుపు.. పండగ చేస్కో.. విన్నర్ మూవీలతో అలరించాడు.

'టెన్త్ వరకూ బాగానే చదివినా.. ఇంటర్ నుంచి మాత్రం చదువు అంతగా అబ్బలేదు. ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. కెమేరా అంటే ఇష్టం ఉండడంతో.. స్టూడియో పెట్టించారు. ఈనాడులో విలేఖరిగా చేసేవాడిని. ఫుల్ టైం కెమేరామ్యాన్ అవుదామంటే.. బక్కగా ఉన్నాను కాబట్టి.. బరువైన కెమేరాలు మోయలేవన్నారు. మాదా రంగారావు మా పెదనాన్న. ఆ పరిచయంతో.. శ్రీహరి నటించిన పోలీస్ చిత్రం కోసం స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. కెమేరామ్యాన్ గానే వెళ్లా కానీ.. నా ఆలోచనలు బాగుండడంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి మార్చారు అని చెప్పాడు గోపీచంద్ మలినేని.

బంధుత్వం ఇంతవరకే తెస్తుంది. ఇక్కడి నుంచి నువ్వే కష్టపడాలి అని శ్రీహరిగారు చెప్పిన మాటలు మర్చిపోలేను. ఆ తర్వాత శ్రీహరి 9 సినిమాలకు ఛాన్స్ ఇప్పించారు. ఇవివి గారి దగ్గర చేశాను. ఆనందం చూసి శ్రీనువైట్ల మేకింగ్ నచ్చడంతో ఆయన దగ్గర చేరాను. ఆయనతో వరుసగా పని చేశాను. అందరివాడు మూవీ చివరి పాట తీస్తున్నప్పుడు చిరంజీవి గారు పిలిచారు. ఈ సినిమాలో 20-30 షాట్స్ ను నీ కోసమే వన్ మోర్ లు చేశా గోపీ అన్నారు. సెట్ లో నా మొహాన్ని పరిశీలించారట ఆయన. నా ఫేస్ లో అసంతృప్తి గమనిస్తే.. వన్ మోర్ చెప్పారట. నచ్చకపోతే లోపల దాచుకోవడం కాదు.. పైకి చెప్పాలన్నారు.

,  ,  ,  ,