Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2017 10:44:58
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి రాబోయే ఖైదీ నెంబర్ 150 - గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు రెండింటి మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఐతే ప్రమోషన్ల విషయంలో మొదట్నుంచి నందమూరి బాలకృష్ణ సినిమానే ముందుంది. ప్రారంభోత్సవం రోజు ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులెందరో రావడంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత ప్రి లుక్.. ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేశారు. అవి ఆకర్షణీయంగా కూడా ఉండటంతో అంతకంతకూ హైప్ పెరిగింది. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్స్ ఇవ్వడం.. ఆన్ లొకేషన్ పిక్స్ రిలీజ్ చేయడం.. సినిమా విశేషాలు పంచుకోవడం.. ఇలా అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే నడిపించాడు క్రిష్.

ఆడియో వేడుక వరకు కూడా ?గౌతమీపుత్ర శాతకర్ణి?.. చిరు సినిమా మీద స్పష్టమైన పైచేయి సాధించింది. కానీ విడుదలకు సమయం దగ్గర పడుతుండగా మాత్రం బాలయ్య సినిమా వెనుకబడిపోతోంది. వరుసగా పాటలు ఒక్కోటి రిలీజ్ చేయడం.. మేకింగ్ వీడియోలు వదలడం.. మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ హంగామా.. సినిమాలోని ఆసక్తికర విశేషాలు పంచుకుంటూ వి.వి.వినాయక్ ఇంటర్వ్యూ ఇవ్వడం.. వీటన్నింటి వల్ల ?ఖైదీ నెంబర్ 150? మీద హైప్ పెరిగింది. అదే సమయంలో ?గౌతమీపుత్ర శాతకర్ణి? గురించి వారం రోజులుగా ఏ వార్తలూ లేవు. బాలయ్య సింగపూర్ టూర్ కు వెళ్లిపోతే.. క్రిష్ ముంబయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మొత్తానికి ఇక్కడ సినిమాను ప్రమోట్ చేసేవాళ్లే లేకపోయారు.

దీంతో సినిమా వార్తల్లో లేకుండా పోయింది. అదే సమయంలో ఖైదీ నెంబర్ 150 దూసుకెళ్లింది. దీంతో ఇప్పుడు హడావుడిగా శాతకర్ణి టీమ్ మేలుకుంది. సెన్సార్ కావడం.. సినిమాకు పన్ను మినహాయింపు దక్కడం.. బాలయ్య కేసీఆర్ ను కలవడం.. శాతకర్ణికి సంబంధించి ఇంకొన్ని అప్ డేట్స్ రావడంతో మళ్లీ సినిమా వార్తల్లోకి వచ్చింది.ఈ నెల 8న పతాకోత్సవం పేరుతో ఒక కార్యక్రమం ప్లాన్ చేసి మళ్లీ సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. అప్పుడు ?గౌతమీపుత్ర శాతకర్ణి? మరింతగా పుంజుకుంటుందేమో చూద్దాం

,  ,  ,  ,  ,