Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2017 13:39:40
facebook Twitter Googleplus
Photo

తండ్రికి తన కూతురు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. కూతురుని ఒక రాజ కుమారిలా చూసుకుంటారు. ఆ తండ్రి ఒక గుమాస్తా అయనా రాజ్యానికి రాజు అయినా.. కూతురి స్థానం అదే. మరి అలాంటిది రాజకుమారుడు కూతురే అయితే ఆ అమ్మాయికి ఎటువంటి తండ్రి ప్రేమ దొరుకుతుందో అర్ధం చేసుకోవచ్చు. మన తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా తన ఇంటిలో ఒక మహాలక్ష్మి ఉంది ఆ మహాలక్ష్మి పేరే సితార. ఈ రోజు సితార తన ఐదోవ ఏటన అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన కూతురు తో గడిపిన కొన్ని మధరు క్షణాలను అభిమానులుతో పంచుకున్నాడు.

మహేశ్ బాబు ఎంతగా షూటింగ్లో బిజీగా ఉన్నా తన ఫ్యామిలి కోసం కొంత సమయం వెచ్చిస్తాడు. తన ముద్దులు కూతురు పుట్టిన రోజు నాడు మహేశ్ తన పై ప్రేమను ఈ విదంగా తెలియపరిచాడు నా కూతురు వలన నా జీవితం మరింత సంతోషంగా మారింది. నా ప్రతి రోజుని తను గొప్పగా మారుస్తుంది. ఈ రోజు నా బంగారం పుట్టిన రోజు సందర్భంగా తను మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ'' అంటూ.. తనను ఆనందంగా ఉంచుతాను అని మాట ఇచ్చాడు. సితార పుట్టిన రోజు నాడు స్పైడర్ సినిమా టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

సినిమాల విషయానికొస్తే.. మురగదాస్ దర్శకత్వంలో నిర్మించిన స్పైడర్ సినిమా వచ్చే సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు స్పై పాత్రలో కనిపించనున్నాడు. మహేశ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. స్పైడర్ సినిమా కు సంగీతం అందిస్తుంది హరీష్ జయరాజ్.

,  ,  ,  ,  ,