Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2015 15:55:35
facebook Twitter Googleplus
Photo

సినిమా పరిశ్రమలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు రకాల వివాదాలు టూబ్యాడ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతల్ని ఫైనాన్సియర్లు రోడ్డు కీడ్చిన సందర్భాలున్నాయి. కొందరు అగ్ర నిర్మాతలు చెప్పుదెబ్బలు చెంపదెబ్బలు తిన్న బ్యాడ్ టైమ్ కూడా ఉంది. అయితే అలాంటివి ఇక్కడ ఎన్నో జరుగుతుంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొందరు బైటపడిపోతుంటారు. రచ్చ కెక్కుతారు. కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ మాత్రం ఇలాంటి బ్యాడ్ ఫేజ్లోనూ ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా నిబ్బరమైన వ్యక్తిత్వాన్ని చూపించి శభాష్ అనిపించారు.

కొన్ని నిజాల్ని దాచేసినా ఆయన చూపించి మెచ్యూరిటీ ప్రతి ఒక్కరి చేతా.. ఔరా అనిపించక మానదు. ఒక స్టిఫ్ పర్సనాలిటీ సాధించిన విజయం కిందే లెక్క. సినిమా కష్టాలు అందరికీ ఉంటాయి. రుద్రమదేవి 3డి విషయంలో టెక్నికల్ గా ఎన్నో ఇబ్బందులు. 3డి విజువల్ గ్రాఫిక్స్ కోసం భారీతనం కోసం దాదాపు 70 కోట్లు పెట్టుబడి పెట్టారు. వాటికి అప్పులు కలుపుకుని 80 కోట్లు అయ్యిందని గుణశేఖర్ స్వయంగా చెప్పారు. అయితే ఆలస్యానికి కారణం కేవలం టెక్నికల్ కారణాలే. ఆర్థిక కారణాలు కానే కాదని చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్టుకి ఆది నుంచి బిజినెస్ పరమైన సమస్యలొచ్చాయని డిస్ర్టిబ్యూటర్లు హ్యాండిచ్చారని ఎప్పటినుండో ఇండస్ర్టీలో వినిపిస్తున్న టాక్. ఓ పెద్ద డిస్ర్టిబ్యూటర్ గుణశేఖర్కి ఏకంగా చుక్కలు చూపించాడని ఫైనాన్సియర్లు అప్పుల విషయంలో గొడవ చేశారని కూడా టాక్ ఉంది. అదంతా కేవలం రూమర్లే అని కొట్టిపాడేయలేం. ఎంతోమంది పెద్దలు తొక్కేయాలని ప్రయత్నించగా.. కొందరు సాయం చేశారు.. అందుకే రుద్రమ రిలీజ్ అవుతోంది.

కాని సినిమా రిలీజ్ వేళ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా ఈ విషయాల్ని ప్రస్థావించకుండా ఎంతో పరిణతి చూపించారు గుణశేఖర్. తనదైన అనుభవాన్ని జోడించి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు. అలా చేయాలంటే నిజంగానే గట్స్ ఉండాలని అవి గుణకి ఉన్నాయని.. అందుకే ఇంత భారీ చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించి రిలీజ్ చేయగలుగుతున్నారని అంతా పొగిడేస్తున్నారిప్పుడు.

,  ,  ,  ,