Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 12:19:25
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని.. మలయాళీ భామ అను ఇమ్మాన్యుయేల్.. కొత్తమ్మాయ్ ప్రియా శ్రీలు హీరో హీరోయిన్లుగా నటించిన మజ్ను ఆడియో రిలీజ్ అయింది. గోపీ సుందర్ సంగీత అందించగా.. ఈ ఆల్బంలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు వేటికవే డిఫరెంట్ గా ఆకట్టుకుంటాయి.

'ఓయ్ మేఘంలా' అంటూ సాగే స్లో మెలోడీ సూపర్బ్ గా ఉంటుంది. ఫిమేల్ వాయిస్ తో వినిపించే ఈ పాట హీరో-హీరోయిన్లు చేస్తున్న జర్నీపై పిక్చరైజ్ చేశారు. 'ఆడరా నీ ఇష్టం ఆడరా' అంటూ ఓ మాస్ బీట్ ని అందించాడు గోపీ సుందర్. మాస్ సాంగ్ లా అనిపిస్తున్నా.. డ్యాన్స్ కి బాగా స్కోప్ ఉన్న బీట్ కావడం.. ప్రోమోలో నాని డ్యాన్స్ ఇరగదీయడం కనిపిస్తుంది. 'కనులు మూసి తెరిచేలోపే గుండె లోకి చేరావే' అంటూ సాగే పాటను డ్యుయెట్ గా చిత్రీకరించారు. 'ఊరికే అలా ఊపిరాపకే..' అనే పాటను హీరో పాత్ర తనలో తను బాధ పడుతుండగా వస్తుందని అర్ధమవుతుంది.

మొత్తం మీద నాలుగు పాటలను డిఫరెంట్ గా ఉండడమే కాదు.. భలేభలే మగాడివోయ్ తర్వాత నాని-గోపిసుందర్ ల కాంబినేషన్ లో వస్తున్న మరో సూపర్ హిట్ ఆల్బం అని తప్పక అనిపిస్తుంది

,  ,  ,  ,  ,  ,