Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 17:37:02
facebook Twitter Googleplus
Photo

ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా మీద ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ముప్పు ముంగిట నిలిచాడు. తేడా వస్తే గుణశేఖర్ పరిస్థితి దారుణంగా ఉండేదే. ఐతే అదృష్టవశాత్తూ ఆ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. గుణను స్వల్ప నష్టాలతో బయటపడేసింది. ఈ ఉత్సాహంలో మళ్లీ ఓ భారీ ప్రయత్నానికి రెడీ అయిపోయాడు గుణ. ఈసారి కూడా సొంత బేనర్లో భక్త ప్రహ్లాద కథతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఐతే అనౌన్స్ మెంట్ తర్వాత దీని గురించి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఈ సినిమా వివరాలు కొంచెం మీడియాతో పంచుకున్నాడు గుణశేఖర్.

గుణశేఖర్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. భక్త ప్రహ్లాద కథతో తీయబోయే సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసినట్లు గుణశేఖర్ వెల్లడించాడు. ఐతే ఈ సినిమాకు ‘భక్త ప్రహ్లాద’ అనేది టైటిల్ కాదని.. పేరేంటో ఇంకా నిర్ణయించలేదని చెప్పాడు. త్వరలోనే ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని.. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నానని గుణ తెలిపాడు. ఈ చిత్రంలో నటీనటులెవరు.. సాంకేతిక నిపుణులెవరు అన్నది ఇంకా నిర్ణయించలేదని.. త్వరలోనే ఆ వివరాలు చెబతానని అన్నాడు గుణ. రుద్రమదేవి తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తానని.. దానికి దీటుగా సినిమా ఉంటుందని చెప్పాడు.

,  ,  ,  ,  ,