Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 12:17:44
facebook Twitter Googleplus
Photo

ఎవడో ఒకడు.. ఈ టైటిల్ తో ఓ మూవీ వస్తోందనే మాట.. టాలీవుడ్ లో ఏడాదికి పైగా వినిపిస్తోంది. గతేడాది రవితేజ కిక్2 రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఈ కథ.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని దగ్గర ఆగిందని అంటున్నారు.

వేణుశ్రీరామ్ డైరెక్టర్ గా.. దిల్ రాజు బ్యానర్ లో తలపెట్టిన మూవీ ఎవడో ఒకడు. రవితేజతో మొదలుకావాల్సిన ఈ చిత్రం అప్పట్లో రకరకాల ఇష్యూలతో ఆగిపోగా.. ఆ వెంటనే ఇదే కథను నాగార్జునకు వినిపించి సినిమా చేసేందుకు ట్రై చేశాడు దిల్ రాజు. అయితే నాగ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ప్రపోజల్ కూడా పట్టాలెక్కలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో.. ఈ కథపై బోలెడంత నమ్మకంగా ఉన్న దిల్ రాజు.. ఎలాగైనా ఎవడో ఒకడుని సెట్స్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ.. ఇప్పుడు నాని దగ్గర సెర్చింగ్ ఆపాడని అంటున్నారు.

ప్రస్తుతం నేను లోకల్ అంటూ దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు నాని. ఎవడో ఒకడు స్టోరీ.. మినిమం గ్యారంటీ హీరో అయిన నానికి పక్కాగా సరిపోతుందని కూడా చెబుతున్నాడట ఈ ప్రొడ్యూసర్. అయితే.. నాని ఆ ఒకడిగా మారేందుకు యాక్సెప్ట్ చేసినా.. నేను లోకల్ తర్వాత మరో మూడు చిత్రాలు క్యూలో ఉండడంతో.. ఇది పట్టాలెక్కేందుకు కనీసం ఏడాది పడుతుంది. ఆలోగా ఈ ఎవడో ఒకడు ఎన్ని టర్న్స్ తీసుకుంటాడో!

,  ,  ,  ,  ,